ఆలయాల్లో ‘స్వచ్ఛతా హీ సేవా’

Sep 15,2024 22:16

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఇఓ డి.పెద్దిరాజు, శ్రీశైలం సిఐ ప్రసాదరావు

– విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు

– క్షేత్రపరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం

ప్రజాశక్తి – శ్రీశైలంశ్రీశైల

దేవస్థానంలో ‘స్వచ్ఛతా హీ సేవా’లో భాగంగా క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు ఇఓ డి. పెద్దిరాజు ఆదివారం తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అక్టోబరు 2న ముగుస్తుందన్నారు. ‘స్వభావ స్వచ్ఛతా – సంస్కార స్వచ్ఛతా’ను రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపంలో పారిశుధ్య పనులను ఇఓ డి. పెద్దిరాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్టోబరు 2 వరకు జరిగే ‘స్వచ్ఛతా హీ సేవా’లో భాగంగా క్షేత్రపరిధిలో పలుచోట్ల ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారులు, పంచమఠాల ప్రాంగణాలు, పాతాళగంగమెట్ల మార్గం, అన్నప్రసాదవితరణ భవనం, దేవస్థానం గోసంరక్షణశాల, యజ్ఞవాటిక, గణేశసదనం, సత్రాలు, యాత్రికుల షెడ్లు, కాటేజీలు, సిబ్బంది వసతి గృహాల ప్రాంతం, వలయ రహదారి, సాక్షిగణపతి ఆలయ పరిసరాలు, హాటకేశ్వర ఆలయ పరిసరాలు, శిఖరేశ్వర ఆలయ పరిసరాలు, క్షేత్రపరిధిలోని ఉద్యానవనాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయ సిబ్బందికి, విద్యార్థినీ, విద్యార్థులకు, శివసేవకులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. పాఠశాలల సహకారంతో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, క్విజ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పోటీలో గెలుపొందిన వారికి అక్టోబరు 2న ఆలయం తరుపున బహుమతులను అందజేస్తామన్నారు. క్షేత్ర పరిధిలో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐ జి. ప్రసాదరావు, డిప్యూటీ ఇఓ ఆర్‌. రమణమ్మ, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధరరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములు, పలువురు విభాగాల పర్యవేక్షకులు, పారిశుద్ధ్యవిభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️