బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి సుగంధినిని అభినందిస్తున్న కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో సుగంధిని ప్రతిభ
ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్
ఈ నెల 16వ తేదీ గుంటూరు జిల్లా తెనాలిలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ సిటీ లీగ్ తైక్వాండో పోటీల్లో కర్నూలు నగరానికి చెందిన క్రీడాకారిణి సుగంధిని జూనియర్ అండర్-49 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించినట్లు తైక్వాండో కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్ బుధవారం తెలిపారు. తమ క్రీడాకారిణి జూన్ నెలలో జరగబోయే సౌత్ జోన్ తైక్వాండో పోటీలకు అర్హత సాధించినట్లు చెప్పారు. ఈ నెల 16న జరిగిన పోటీలకు ముఖ్య అతిథిగా తెనాలి అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి లక్ష్మీపతి రావు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సలాంలు పాల్గొని క్రీడాకారిణి సుగంధినికి బంగారు పతకాన్ని ప్రదానం చేశారని తెలిపారు.