సిల్హెట్ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ 6 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ను మట్టికరిపించాడు. 332 పరుగుల విజయ లక్ష్యంతో చివరి రోజు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 181 పరుగులకు ఆలౌట్ ఆలౌట్ అయ్యింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్ నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి 113-7తో నిలచింది. చివరి రోజు మరో 68 పరుగులను మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. చివరి టెస్టు డిసెంబర్ 6న ప్రారంభం కానుంది.
