క్రీడలతో మానసిక ఉల్లాసం : ఆర్డిఒ దాసు

Sep 27,2024 21:46

క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆర్డిఒ దాసు

ప్రజాశక్తి – ఆత్మకూర్‌

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని ప్రతి విద్యార్థిని, విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందని ఆర్డిఒ దాసు పేర్కొన్నారు. శ్రీశైలం నియోజకవర్గ స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన క్రీడా పోటీలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. పోటీల్లో శ్రీశైలం, సున్నిపెంట, ఆత్మకూర్‌, వెలుగోడు, బండి ఆత్మకూరు. మహానంది మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రధానంగా వాలీబాల్‌, కబాడీ, ఖోఖో, బాల్‌ బ్యాడ్మింటన్‌, యోగా, చెస్‌ పోటీలు నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గంలోని ఐదు మండలాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్డిఒ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ మంచి నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి ముందుకెళ్లాలన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు, షీల్డ్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యోగేంద్ర రాజు, విద్యా కమిటీ ఛైర్మన్‌ శివకుమార్‌, టిడిపి పట్టణ అధ్యక్షుడు జట్టు వేణుగోపాల్‌, మండల అధ్యక్షుడు శివప్రసాద్‌ రెడ్డి, అబ్దుల్లాపురం బాష, టిడిపి మైనార్టీసెట్‌ జిల్లా అధ్యక్షుడు కరీముల్లా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి దాదాపు 1000 మంది క్రీడాకారులకు భోజన వసతిని కల్పించారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోటీలను పిఇటి దేవానంద్‌, శంకర,్‌ సుదర్శన్‌ రావుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

తాజా వార్తలు

➡️