సంతాప సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె ప్రభాకర్ రెడ్డి
ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్
పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే భాస్కర్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జై కిసాన్ పార్కులో కె భాస్కర్ రెడ్డి సంతాప సభను సిఐటియు పట్టణ కార్యదర్శి టి గోపాలకృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ నాగరాజు, యేసురత్నంలు మాట్లాడారు. భాస్కర్ రెడ్డి కొణిదెల గ్రామంలో గని కార్మిక సంఘాన్ని స్థాపించి కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు ముందు వరుసలో ఉండేవారని గుర్తు చేశారు. 40ఏళ్లుగా వివిధ రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ జిల్లా స్థాయి సిఐటియు ఉపాధ్యక్షులుగా ఎదిగారన్నారు. ఆయన ఆశయాలు సాధించిన రోజే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళ్లు అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి. పకీరి సాహెబ్, బెస్తరాజు, ఎస్ ఉస్మాన్ బాష, శ్రీనివాసులు, ఓబులేసు, ఆర్ జయరాం, సాజిదాబి, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు డి మదర్‌బి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు జి నాగమణి, నజిరున్నీసా, కెవిపిఎస్ జిల్లా నాయకురాలు రంగమ్మ, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దూదేకుల బాబు, హర్షవర్ధన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చాంద్ బాష, అంగన్‌వాడీ, ఆశా, మున్సిపల్ వర్కర్స్, నాయకులు పాల్గొన్నారు.