596 మార్కులు సాధించిన విద్యార్థిని ఎ.నేహా
పది ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్
రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు అత్యత్తమ ప్రతిభను కనబరిచారు. బుధవారం వెంకటరమణ కాలనీ బ్రాంచి శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల ఎజిఎం సురేష్ పాల్గొని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థిని ఎ.నేహ 596 మార్కులు సాధించి కర్నూలు జిల్లా రెండవ టాపర్‌గా నిలిచారని చెప్పారు. 580 మార్కులకు పైగా 8 మంది విద్యార్థులు, 570 పైగా 9 మంది, 550 పైగా 39 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని తెలిపారు. తమ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణతతో ఘన విజయం సాధించినట్లు చెప్పారు. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రామాంజనేయులు, కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు, డీన్ రాజేష్ రెడ్డి, ఎఒ పరమేశ్వర రెడ్డి, మద్దిలేటి, విజయకుమార్, రంగస్వామి, రామకృష్ణా రెడ్డి, ఉపాధ్యాయ బృందం శ్రీలత, ప్రవళ్లిక, వినోద్, నాగేంద్ర, చంద్రశేఖర్, నాగరాజు, విశ్వనాథ్, కలీద్ తదితరులు పాల్గొనారు.