ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

Nov 4,2024 21:00

మాట్లాడుతున్న టి.రమేష్‌ కుమార్‌

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
– సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
ప్రజాశక్తి – బండి ఆత్మకూర్‌
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఎం నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం బండి ఆత్మకూరు మండలం పార్లపల్లి గ్రామంలో సిపిఎం మండల 3వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా టి.రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ పేదలు, రైతులు, అసంఘటిత రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సిపిఎం నాయకులు, కార్యకర్తలు నిరంతరం పోరాటాలు చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో మండలంలో చేపట్టిన పోరాటాలను సమీక్షించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. అనంతరం సిపిఎం మండల కమిటీని ఎన్నుకున్నారు. బండి ఆత్మకూర్‌ మండల కార్యదర్శిగా రత్నమయ్య, కమిటీ సభ్యులుగా డేవిడ్‌, రాజు, సుబ్బరాయుడు, సింగవరం ఏసేపు, ఈర్నపాడు ఏసేపు, పుల్లయ్య, భాగ్యమ్మ, వెంకట రమణమ్మ, శ్యామ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

➡️