జ్యోతిరావ్‌ పూలే స్ఫూర్తితో హింసకి వ్యతిరేకంగా పోరాడుదాం : ఐద్వా రాష్ట్రఅద్యక్షులు ప్రభావతి

Nov 28,2023 16:43 #aidwa, #vijayanagaram

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : నవంబర్‌ 25 టు డిసెంబర్‌ 10 వరకు హింస వ్యతిరేక పక్షోత్సవాల సందర్భంగా విజయనగరంలో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ నుండి ప్రజాసంఘాలు ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిళలపై జరిగే దాడులు నేరాలు అరికట్టాలని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌లు ఏర్పాటు చేయాలని, స్త్రీలహక్కులు కాపాడాలని, మహిళా రక్షణచట్టాలు పటిష్టంగా అమలు చేయాలని 2024లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుని అమలు చేయాలంటూ నినదించారు. అనంతరం జరిగిన జిల్లా సదస్సులో రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ.. మహిళలపై నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు అమ్మకాలు జరుగుతున్నాయని నేరాలు పెరుగుతున్నాయని, రోజుకి ప్రతి ముగ్గురు మహిళలలో ఒక మహిళపై అఘాయిత్యం జరుగుతుందన్నారు. నేరాలకి కారణాలు అయినటువంటి ఈ మాదకద్రవ్యాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్త్రీల రక్షణ కరువైందని తెలియజేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై చిన్నారులపై నేరాలు పెరగడమే కాకుండా ప్రజాస్వామ్య హక్కులపై దాడి పెరుగుతోందని అధిక ధరల విపరీతంగా పెరుగుతున్నాయని.. దీనివలన స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ఆకలి సూచికలో భారతదేశం 11వ స్థానానికి దిగజారి పోయిందని ఇదేనా భారత్‌ వెలిగిపోవడమంటే అని అమే ప్రశ్నించారు.ఉపాధి లేక 11 కోట్ల మంది ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారని .ఈ 76 ఏళ్ల భారతావనిలో అదానీ, అంబానీల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని పట్టణ సంస్కరణలు వేగవంతంగా చేసి ఇంటి పన్నులు చెత్త పన్ను లు, ఆస్తి పన్నులు పెంచుతున్నారని మహిళల మీద మరింత ఆర్థిక పరమైన వత్తీల్లు పెరుగుతున్నాయని. దీని వలన మహిళలూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యలు పరిష్కారం కోసం 25నుంచి డిసెంబర్‌ 10 వరకు పక్షోత్సవం జరపాలని ,సెమినార్లు సదస్సులు, ర్యాలీలు జరపాలని చెప్పి మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని కందిపప్పు కందిపప్పు నిత్యవసర వస్తువులు 17 రకాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. అనంతరంజ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్య కోసం స్త్రీల యొక్క హక్కుల కోసం పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ అన్నారు 18 స్కూల్స్‌ ను ఆయన ప్రత్యేకంగా నడిపించారని బడుగు బలహీన వర్గాలకి అమ్మాయిలకి చదువు నేర్పించే దిశగా భార్యకీ చదువు నేర్పించి తనని ఆడపిల్లలు చదువు చెప్పించాలని చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆడపిల్లలు చదివించే దిశగా ఆ రోజుల్లో ప్రయత్నం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఆయన బాటలో మహిళలూ పయనించాలని పి .రమణమ్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయకార్యదర్శి జి.పుణ్యవతి, టీ.కృష్ణమ్మ, కె.కుమారి, సిహెచ్‌.రమణమ్మ, వి.లక్ష్మి పాల్గొన్నారు .

➡️