మున్సిపల్‌ కార్మికులకు పెండింగ్‌ పిఎఫ్‌ చెల్లించాలి సిఐటియు జిల్లా అధ్యక్షుడు వి యేసు రత్నం

Sep 26,2024 21:58

కమిషనర్‌ రమేష్‌ బాబుకు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి – ఆత్మకూర్‌

ఆత్మకూరు మున్సిపాల్టీలో పని చేస్తున్న కార్మికులకు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న పిఎఫ్‌ను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రజాక్‌, రామ్‌ నాయక్‌, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు నాగన్న, పెద్ద నాగరాజు, తిమయ్య, గొడుగు రాజులు ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరిచాలని కోరుతూ… మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబుకు కార్మికులతో కలిసి వారు గురువారం వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. మున్సిపాల్టీ పరిధిలోని 24 వార్డులను పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులకు సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమిస్కిల్డ్‌ వేతనాలు, హెల్త్‌, రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలన్నారు. 22 మంది కార్మికులకు పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌ జమ చేయాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, కార్మికులకు పని ముట్లు ఇవ్వాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మున్సిపల్‌ కార్మికులు రాజేంద్ర, నాగ ప్రసాద్‌, రమేష్‌, స్వాములు, నాగన్న, విజరు కుమార్‌, సురేష్‌, సువర్ణమ్మ, దేవమ్మ, సుగుణమ్మ, మరియమ్మ ఉన్నారు.

తాజా వార్తలు

➡️