రాత్రి 10లోపు నిమజ్జనాలు ముగిసేలా చర్యలు

Sep 9,2024 21:46

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా

– జిల్లా ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా

ప్రజాశక్తి – ఆత్మకురు

గణేష్‌ నిమజ్జనాలు రాత్రి 10 గంటల్లోపు ముగిసేలా చర్యలు చేపట్టాలని, నిమజ్జనం అనంతరం స్నానాలు ఆచరించే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా పోలీస్‌ అధికారులకు సూచించారు. ఆత్మకూర్‌ టౌన్‌, వెలుగోడు టౌన్‌, ఎర్ర గూడురు వద్ద తెలుగు గంగ కాల్వల దగ్గర ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ప్రదేశాలను జిల్లా ఎస్పీ సోమవారం పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2362 వినాయక విగ్రహాలను ప్రజలు ఏర్పాటు చేశారన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా సుమారు 1747 వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట భద్రతా చర్యలు తీసుకొని, తగిన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్‌ శాఖ సూచనలు అనుసరిస్తూ నిమజ్జనాన్ని సురక్షితంగా జరుపుకోవాలన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో తగిన లైటింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, పోలీసు అధికారులు, సిబ్బంది 24/7 నిమజ్జన ప్రదేశాల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. వరుస క్రమంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయించాలన్నారు. నిమజ్జనానికి విగ్రహంతో పాటు ఐదు నుండి పది మందిని మాత్రమే అనుమతించాలన్నారు. మహిళలు, పిల్లలు, మద్యం సేవించిన వారిని అనుమతించరాదన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమర్జనానికి వెళ్లే వాహనాలు, నిమజ్జనం ముగించుకొని వచ్చే వాహనాలు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట స్పెషల్‌ బ్రాంచ్‌ డి.ఎస్‌.పి, జె.వి సంతోష్‌, ఆత్మకూరు డిఎస్పి రామంజీ నాయక్‌, పాములపాడు ఎస్‌ఐ సురేష్‌, నంద్యాల పిసిఆర్‌ఎస్‌ఐ లక్ష్మయ్య, సిబ్బంది ఉన్నారు.

తాజా వార్తలు

➡️