సత్తెనపల్లి:అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తెలంగాణ లో కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, డిసెంబర్ 8వ తేదీ నుండి జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి పిలుప ునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పుతుంబాక భవన్ లో జరిగిన సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమా వేశానికి సుజాత అధ్యక్షత వహించారు. గుంటూరు మల్లేశ్వరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2022లో అంగన్వాడీ లకు గ్రాడ్యూటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చ లేదని, హెల్పర్స్ ప్రమోషన్లకు ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు రూపొందించ లేదని, సెంటర్ల నిర్వహణకు అంగన్వాడీలే పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి నెట్ట బడిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎప ిఅంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) డిసెంబర్ 8వ తేదీ నుండి నిరవేదిక సమ్మె కు పిలుపు నిచ్చినట్లు చెప్పారు. సమ్మెలో అంగన్వాడీ వర్కర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సన్నాహక సమా వేశానికి ఇతర ప్రజా సంఘాల నాయ కులు పాల్గొని ఈ పోరాటానికి మద్దతు తెలిపారు. సమావేశంలో కౌలు రైతు సంఘం నాయకులు పెండ్యాల మహేష్. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వి.చంద్రకళ, యం జగన్నాద ¸రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సాల్మన్ రాజు, రైతు సంఘం నాయకులు గుంటుపల్లి బాలకష్ణ, ప్రజా నాట్య మండలి నాయకులు పొట్టి సూర్య ప్రకాష్ రావు, డివైఎఫ్‌ఐ నాయకులు జడ రాజ్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎస్కే ఇట్లాస్ పాల్గొన్నారు. ప్రజాశక్తి – మాచర్లఅంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అతి తక్కువ వేతనాలతో ప్రభుత్వ రంగ విభాగంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారని వారి శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదని సిఐటియునాయకులు బండ్ల మహేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగ న్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్లకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని, కోర్టు తీర్పుల ప్రకారం అంగన్వాడీి వర్కర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియుతో పాటు ఎఐటియుసి, ఐఫ్ టి యూ యూనియన్లకు చెందిన అంగన్వాడి వర్కర్లందరూ సమ్మెలో పాల్గొంటున్నారని ప్రభుత్వం సమస్యను వెంటనే పరి ష్కరిం చాలని కోరారు. సమ్మె నోటీసును ఐసిడి ఎస్ కార్యాలయంలో సంబంధిత అధి కారికి అందజేశారు.