శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం

శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం

శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవంతిరుమలలో రద్దీ సాధారణంప్రజాశక్తి- తిరుమల తిరుమలలో నేడు భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. అదివారం అయినా పెద్దగా భక్తుల దర్శనం లేదు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో పాటు కార్తీక మాసం కూడా కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అలాగే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తుండటం కూడా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి కారణమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వీకెండ్‌లో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనం సులభంగా లభిస్తుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కేవలం 9 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రధాని రాకతో భక్తులను వేచియుంచకుండా దర్శనానికి అనుమతించారు.వేడుకగా కార్తీక దీపోత్సవంతిరుమల శ్రీవారి అలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు.ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం ప్రారంభమైంది. మొదట శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్యాల నడుమ ఏర్పాటు చేశారు. తిరుమల పెద్దజీయర్‌ స్వామి, ఈవో ఏవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, డిఎల్వో వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈఓ లోకనాథం, విజివో నందకిషోర్‌ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

➡️