మోడల్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దుదాం : ‘చింతల’

ప్రజాశక్తి-పీలేరు అన్నమయ్య జిల్లాలో పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఓ మోడల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దుదామని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే అధ్యక్షతన స్థానిక ఆసుపత్రి కొత్త భవనంలో ఆసుపత్రి అభివద్ధి కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీలేరు ప్రభుత్వాసుపత్రి 50 పడకల స్థాయి నుంచి వంద పడకల స్థాయికి విస్తరిస్తుండడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి విస్తరణలో చాలామంది కషి, పట్టుదల ఉన్నాయని గుర్తు చేశారు. జిల్లాలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి చాలా మంచి పేరు, గుర్తింపు ఉన్నాయని, అవి చెరగకుండా అలాగే కొనసాగీస్తూ రోగుల సంఖ్య పెరిగేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తగిన రీతిలో వారికి సేవలు అందించాలని కోరారు. పీలేరు పట్టణానికి రెండు జాతీయ రహదారులు ఉండడంతో తరచూ రహదారులపై ప్రమాదాలు జరుగుతుంటాయని, ఆసుపత్రికి అత్యవసర వైద్యం కోసం వచ్చే క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. అందు కోసం పీలేరు ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంలో ట్రామా కేర్‌ సెంటర్‌ అవసరం ఉందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దష్టికి తీసుకువెళ్లి దాని మంజులకు కషి చేస్తానని పేర్కొన్నారు. ఇక్కడ డయాలసిస్‌ సెంటర్‌ కూడా అవసరం ఉందని చెప్పారు. ఆసుపత్రి అభివ ద్ధికి దాతల సహకారాన్ని కూడా కోరుదామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథరెడ్డి, జెడ్పిటిసి ఏటి రత్నశేఖర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ షేక్‌ హబీబ్‌ బాష, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎండి షఫీ, వైస్‌ ఎంపిపి ఎన్‌.వెంకటాచలపతి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హుమయూన్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు మహితా ఆనంద్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ నాగరాజమ్మ, డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, కంభం నరసింహారెడ్డి, ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️