ప్రజాశక్తి-కలసపాడు మండల అభివద్ధికి సమిష్టిగా కషి చేద్దామని ఎంపిపి బోధనబోయిన నిర్మల నారాయణ అన్నారు. బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపిడిఒ మహబూబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల అభివద్ధికి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు కలిసి సమిష్టిగా ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు తగిన కషి చేయాలని పేర్కొన్నారు. మండలంలో ఇంతవరకు అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని, సచివాలయాల నుండి నాడు నేడు పాఠశాలల వరకు, అనేక కోట్ల రూపాయలను వెచ్చించామని చెప్పారు. తాగునీరు, పారిశుధ్యం, ఉపాధి హామీ పనులు, ఇంకా అనేక విధాలుగా అభివ ద్ధిని సాధించి ప్రతి గ్రామానికి రహదారులను కల్పించామని తెలిపారు. జగనన్న కాలనీ, గంగయ్యపల్లిలో పనులు వేగవంతం చేయాలన్నారు. అధికారులు ప్రజలతో ఉండి వారి సమస్యలను తీర్చాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి అంకన పెద్దగురువురెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ సుధా రామకష్ణారెడ్డి, సుజనా శ్రీనివాస్‌రెడ్డి, రాంబాబు, జయన్న, సంజరు, రవణమ్మ రామసుబ్బారెడ్డి, ఎంపిటిసిలు రమేష్, కిషోర్ బేగం, కో-ఆప్షన్ నెంబర్లు, యుపిఆర్‌డి మురారి, వైసిపి నాయకులు నారాయణ, గురువురెడ్డి పాల్గొన్నారు.