నారాయణలో ‘థ్యాంక్స్‌ గివింగ్‌ డే’

అంధుల పాఠశాలలో విద్యార్థులకు తినుబండారాలు పంపిణీ చేసిన నారాయణ పాఠశాల యాజమాన్యం

అంధుల పాఠశాలలో విద్యార్థులకు తినుబండారాలు పంపిణీ చేసిన నారాయణ పాఠశాల యాజమాన్యం

       అనంతపురం : నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో గురువారం ‘థ్యాంక్స్‌ గివింగ్‌ డే’ నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇచ్చిన సాయంతో కురుకుంట్లలోని ‘అంధ మహిళలు, చిన్న పిల్లల అనాథాశ్రమంలో’ బియ్యం, దుస్తులు, పండ్లు, బిస్కెట్లు, చాకెట్లు తదితర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎజిఎం రమేష్‌బాబు, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు రాధానాయుడు, వైస్‌ ప్రిన్సిపళ్లు వాణి, సుధ, గౌసియా, ఎఒ రమేష్‌, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️