కళ్యాణమస్తు, షాదీతోఫా మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్,
అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా కింద జూలై, సెప్టెంబర్-2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 469 మందికి రూ.3.86 కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందజేసిందని జెడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ, కలెక్టర్ గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లోని విసి హాల్ కళ్యాణమస్తు, షాదీతోఫా జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్‌పర్సన్ ప్రమీల, నగర పాలక సంస్థ మేయర్ వసీం, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ మంజుల, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఎడిసిసి బ్యాంకు ఛైర్‌పర్సన్ లిఖిత, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఉమాదేవి, జిల్లా వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ రిజ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా జిల్లాలో 469 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ప్రభుత్వం అందించే సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, డిటిడబ్ల్యూఒ అన్నాదొర, బీసీ వెల్ఫేర్ డిడి కుషష్బు కొఠారి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.