‘అవగాహనతోనే ఎయిడ్స్‌ నిర్మూలన’

ప్రజాశక్తి-కడప అర్బన్‌ అవగాహనతోనే ఎయిడ్స్‌ను నిర్మూలించవచ్చని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె. నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్‌ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఎయిడ్స్‌ దినం, సంఘాలను నడిపించనివ్వండి’ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథి నగర పాలక కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌. రవిబాబు, డాక్టర్‌ ఉమామహేశ్వర్‌రావుతో కలిసి డిఎంహెచ్‌ఒ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎయిడ్స్‌ నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ సంవత్సరం ‘సంఘాలను నడిపించనివ్వండి’ అనే నినాదం తీసుకు వచ్చిం దని తెలిపారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్‌ సభా భవనంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికారి, సెక్రటరీ సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ బాబా ఫక్రుద్దీన్‌ మాట్లాడుతూ హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు చట్టం దష్టిలో అందరు సమానమని పేర్కొన్నారు. వారికి 2017 సవరణ చట్టం అండగా ఉం లటుందని చెప్పారు. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రావిద్రనాథ్‌ మాట్లాడుతూ హెచ్‌.ఐ.వి /ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి, నిర్మూలనకు హెచ్‌ఐవి పరీక్ష చాలా కీలకమన్నారు. కార్యక్రమానికి రిమ్స్‌ మెడికల్‌ కళాశాల విభాగ హెచ్‌ఒడి మెడికల్‌ ఆఫీసర్స్‌ డాక్టర్‌ లక్ష్మీ సుశీల, సిబ్బంది పాల్గొన్నారు. చాపాడు : ఎయిడ్స్‌ నివారణకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని మండల వైదా ్యధికారి శ్రీవాణి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చాపాడులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ 1988 డిసెంబర్‌ 1నుంచి ఎయిడ్స్‌ డే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎయిడ్స్‌ వ్యాధికారక హెచ్‌ఐవికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కావ్య మాధురి, డాక్టర్‌ఓబులేసు, సిహెచ్‌ ఓ మహదేవ్‌ యాదవ్‌, సిబ్బంది రమేష్‌, ఎఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. మైదుకూరులో… స్థానిక బాల శివ యోగేంద్ర మహారాజ్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌ బి సురేష్‌ బాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ భూమిరెడ్డి రవి కళ్యాణ్‌ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ డే నిర్వహించారు. ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలనకు చేయి చేయి కలుపుదాం అంటూ విజయ హాల్‌ నుండి మార్కెట్‌ మీదుగా కడప రోడ్డు అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీగా చేపట్టి శ్రీకష్ణదేవరాయల కూడలిలో మానవహరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు మహబూబ్‌ బాషా, వేణుగోపాల్‌ నాయక్‌, గంగులయ్య , నవీన్‌, విజరు, శేఖర్‌ ,ప్రసాద్‌ రెడ్డి ,సురేంద్ర , విద్యార్థులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : గ్రామాల్లో ఎయిడ్స్‌ వ్యాధిపై అవ గాహన కల్పించి ప్రజల్లో భయాందోళనలు పోగొట్టాలని కృష్ణ శారద కళాశాల ప్రిన్సిపల్‌ జయప్రద పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం పట్టణంలోని గాంధీ బొమ్మ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు శాంతి ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన నినాదాలు చేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ పి.వి.మోహన్‌ రెడ్డి, ప్రభాకర్‌, ఇతర అధ్యాపక బందం పాల్గొన్నారు. ఎర్రగుంట్ల : ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా నగర పంచాయతీలో, మండలంలోని చిలంకూరు గ్రామంలో స్థానిక పిహెచ్‌సి వైద్యులు ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహి ంచారు. కార్యక్రమంలో వైద్యులు సాయి చరిత రెడ్డి, జోత్స్న, శ్రీనాథ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ నాగ మునిరెడ్డి, సూపర్‌వైజర్లు ఓబులేసు,సుభద్ర, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు( పుట్టపర్తి సర్కిల్‌) : పట్టణం లోని రాణి తిరుమల దేవి డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఐవిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ టి చంద్రశేఖర్‌ రెడ్డి, కరస్పాండెంట్‌ ఎల్‌.తరుణీంద్ర శేఖర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌, ఇన్‌ఛార్జి ప్రిన్సి పల్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యా పకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీకష్ణ గీత ాశ్రమం, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల ఆధ్వ ర్యంలో ఎయిడ్స్‌డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్‌ అరకటవేముల హరినారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంల విద్యార్థులు ఎయిడ్స్‌ డే సందర్భంగా నినాదాలు చేస్తూ స్థానిక గీత ఆశ్రమం నుంచి గాంధీ రోడ్డు నందు ర్యాలీగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ముస్తఫా, రామ్మోహన్‌, శారద, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ గౌరీ శంకర్‌, మౌనయ్యా,ఎన్సిసి ఇన్స్ట్రక్టర్‌ దావీద్‌, విద్యార్థులు పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : పాంతీయ ఎయిడ్స్‌ నివారణ విభాగం, నల్లపురెడ్డిపల్లి ప్రాధమిక వైద్యాశాల, స్నేహిత అమత హస్తం సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సంద ర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని వైద్య కళాశాల సూపరి ంటెండెంట్‌ డాక్టర్‌ విఘ్నేష్‌ రావు, ప్రిన్సిపల్‌ వర లక్ష్మి, మెడికల్‌ సూప రింటెండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ సెల్వన్‌ రాజు, నల్లపురెడ్డి పల్లి ప్రాథమిక వైద్యా శాల డాక్టర్‌ లిఖిత, నగరిగుట్ట పట్టణ ప్రాథమిక వైద్యాశాల వైద్యులు డాక్టర్‌ స్నేహ – ప్రత్యూష ప్రారంభించారు. ఆసుపత్రి నుండి ప్రారంభమైన ర్యాలీ పూల అంగళ్ల కూడలి వరకు చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఐసిటిఎస్‌ కౌన్సిలర్‌ వెంకటసుబ్బయ్య, ఎస్‌టిఐ కౌన్సిలర్‌ బాదల్‌ వలీ, సబ్‌ యూనిట్‌ అధికారులు సతీష్‌, సిద్దయ్య, పిఎంఒ సుబ్బారెడ్డి, టీబీ హెల్త్‌ విజిటర్‌ భాగ్యలక్ష్మి ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, స్నేహిత అమత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు, నేత్రనిధి టెక్నీషియన్‌ హరీష్‌, సభ్యులు రాఘవేంద్ర రెడ్డి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. వేంపల్లె : ఎయిడ్స్‌ వ్యాధి పట్ల ప్రతి యవతతో పాటు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చెరసాల యోగాంజనేయులు, తహశీల్దార్‌ చంద్ర శేఖర్‌ రెడ్డిలు కోరారు. జాతీయ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా వేంపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంల ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటిలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటిల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు తహశీల్దార్‌ చంద్ర శేఖర్‌ రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ మల్లేశ్వరమ్మ ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ నాగేంద్ర, అధ్యాపకులు శ్రీకాంత్‌ రెడ్డి ,డాక్టర్‌ మల్లేశ్వరమ్మ, శ్రీనివాసన్‌, రాజారెడ్డి ,ఫిజికల్‌ డైరెక్టర్‌ తేజేంద్ర, ట్రిపుల్‌ ఐటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు తిరుపతి రెడ్డి, రమేష్‌, విశ్వనాథ్‌, దీప్తి, ఐసిటిసి కౌన్సిలర్‌ ఆంజనేయులు, ఎఎన్‌ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️