ప్రజాశక్తి-ఉంగుటూరు
పశువైద్య రంగంలో జరుగుతున్న వివిధ పరిశోధనలను ఈ కాన్ఫరెన్స్ ద్వారా భావితర పశు వైద్యులు స్ఫూర్తిదాయకంగా తీసుకొని దేశంలో పశువైద్య రంగం అభివృద్ధికి పాటుపడాలని పద్మశ్రీ డాక్టర్ సోసమ్మ ఐపే అన్నారు బుధవారం మండలంలోని ఆత్మకూరు స్వర్ణ భారతి ట్రస్ట్ నందు ప్రారంభమైన జాతీయ మహిళా పశువైద్యుల సంఘం కాన్ఫరెన్స్ కు ముఖ్యఅతిథిగా హాజరైన సోసమ్మ మాట్లాడుతూ దేశంలో నేటికీ 55 శాతానికి పైగా మహిళలు పాడి పరిశ్రమపై ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని వారికి పశువైద్యులుగా పశువైద్య రంగంలో జరుగుతున్న వివిధ పరిశోధనలను తెలుసుకొని పశుపోషణకు సహాయపడటం కోసం పశు వైద్య వత్తిని ఎంచుకొని ప్రతి సంవత్సరం 65 శాతం మంది యువ మహిళలు ఈ వత్తిలో ప్రావీణ్యం పొందుతున్నారని వారందరికీ నా తరపున కతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు మహిళలుగా ఇంత పెద్ద సంఖ్యలో పశువైద్యులుగా ముందుకు రావడం చూసి నేను చేసిన పశు వైద్య వత్తిపట్ల మరింత గౌరవం పెరిగిందని అన్నారు దేశంలో మహిళలు వివిధ హౌదాలలో పశువైద్య సేవకులుగా మరింత ముందుకు రావాలని పశుపోషణ పట్ల రైతులకు అవగాహన కల్పించి మానవ జీవితంలో పశుపోషణ ఒక భాగంగా ఉండాలని ఉండేందుకు కషి చేయాలని అన్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం మరియు జాతీయ మహిళా పశువైద్యుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల గన్నవరం వారు వైవిధ్యం సమానత్వం మరియు సమగ్రత ద్వారా ఒక ఆరోగ్యం వైపు పశువైద్య వత్తిని బలోపేతం చేయాలని తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరలోహ్మయ్య డాక్టర్ మధుస్వామి డాక్టర్ లతా మంగేష్కర్ ఆంధ్ర షుగర్స్ డైరెక్టర్ మల్లపూడి నరేంద్రనాథ్ డాక్టర్ బి వి ఎస్ కిషోర్ డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.