ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ : సారా విక్రయాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గన్నవరం ఎక్సైజ్ సీఐ ఎంఎస్ఎస్ఎన్ శాస్త్రి హెచ్చరించారు. నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో నాటు సారా విక్రయాల్లో నిందితులైన మడిచర్ల, వీరవల్లి, కొయ్యూరుకు చెందిన 8మందిని ముందస్తుగా గురువారం బాపులపాడు తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు ఎదుట సీఐ హాజరుపరిచి చెప్పారు. మరోసారి సారా తయారు చేస్తే లక్ష రూపాయల జరమానాతోపాటు 6 నెలల జైలు శిక్ష పడుతుందని సీఐ శాస్త్రి వారిని హెచ్చరించి బైండోవర్ చేశారు.