సరిహద్దుల్లో గజ..గజ.!

Nov 24,2023 23:51
సరిహద్దుల్లో గజ..గజ.!

పంటలపై కొనసాగుతున్న ఏనుగుల దాడులుప్రజాశక్తి-వికోట: కర్నాటక, తమిళనాడు సరిహద్దులను ఆవాసాలుగా ఏర్పరచుకున్న ఏనుగులు పంటలపై దాడులు కొనసాగి స్తున్నాయి. పగలంతా అటవీ ప్రాంతంలో ఉండి రాత్రైతే పంటలపై స్వైరవిహారం చేస్తున్నాయి. చేతికందే పంటలను పెకలించి.. అందినకాడికి తిని మిగిలింది తొక్కి నాశనం చేస్తున్నాయి. చేతికందే పంటలు దాడుల్లో నాశనమవుతుంటే రైతులు బోరున విలపిస్తున్నారు. ప్రత్యాన్మాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని గొంతెత్తి వేడుకుంటున్నారు. కుంకీ ఆపరేషన్‌ చేపట్టాలని అధికారులను ప్రాదేయపడుతున్నారు. గురువారం రాత్రి వికోట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంట పొలాలపై 15ఏనుగుల గుంపు దాడులు చేశాయి. రైతు సురేష్‌కు చెందిన మొక్కజొన్న, వరి పంటలను తొక్కి నాశనం చేశాయి. చేతికందే పంట రాత్రి ఏనుగుల దాడిలో ధ్వంసం కావడంతో కన్నీటి పర్యంతమై ఆందోళన వ్యక్తం చేశాడు. సుమారు రూ.2లక్షల మేరా నష్ట వాటిళ్లిందని బాధిత రైతు తెలిపారు. జరిగిన పంట నష్టానికి అధికారులు పరిహారం ఇప్పించాలని కోరారు.

➡️