పౌరుడా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో..

Dec 1,2023 23:52
పౌరుడా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో..

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ప్రతి పౌరుడు ఓటు విలువను గుర్తించుకొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రత్యేక ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ, ర్యాలీ, మానవహారం భారీ ఎత్తున నిర్వహించారు. జాతీయ జెండా చేత పట్టి వేల మంది నినాధాలతో ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ.. నినాధాలు చేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జెసి శ్రీనివాసులు, ఆర్డివో చిన్నయ్య, ఏఈఆర్‌వో కమిషనర్‌ డాక్టర్‌ అరుణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్వీప్‌ ”సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోరల్‌ పార్టిసిపేషన్‌ ప్రోగ్రాం” కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటిసారి చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఇంకా ఓటరుగా నమోదు కాని వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, తహశీల్దార్‌లు మురళీమోహన్‌, కిరణ్‌కుమార్‌, సీఎంఎం గోపి, ఎంఈ గోమతి, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, ఎసీపీ రామకృష్ణుడు, నగరపాలక అధికారులు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఎన్సీసీ విద్యార్థులు, నగరంలోని వివిధ జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈవీఎంలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశంప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ప్రజలలో ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు ఒక శాతం ఈవీఎంలను రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలకు, మొబైల్‌ వ్యాన్‌ ద్వారా అవగాహన కల్పించేందుకు ఉపయోగించడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ డిఆర్‌ఓ రాజశేఖర్‌, రాజకీ య పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని ఈవిఎం గోడౌన్‌లో ఈవిఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాకు 1762 ఈవిఎంలు అసెంబ్లీ ఎన్నికలకు సంభందించి ఉన్నా యన్నారు. అందులో 18, మరో 1762 ఈవిఎంలు పార్లమెంట్‌కు సంభందించి ఉన్నాయన్నారు. అందులోంచి 18ఈవిఎంలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉపయోగిస్తామన్నారు. నాలుగు అర్‌డిఒ కార్యాలయాలలో పాటు, మొబైల్‌ వ్యాన్‌లు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వివిద పార్టీ నాయకులు పాల్గొన్నారు.అన్ని నియోజకవర్గాలలో ఈవీఎంలపై అవగాహన :జిల్లా కలెక్టర్‌ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు 36 ఈవీఎంలను అవగాహన కోసం ఇవ్వడం జరుగుతోందని నియోజకవర్గ కేంద్రాలలో వీటిని ఉంచాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో అవగాహన కోసం ఈవీఎంలను ఎన్నికల కమిషన్‌ ఒక పర్సెంట్‌ రేషియోలో ఇవ్వడం జరిగిందని తెలుపుతూ తగిన జాగ్రత్తల గురించి వివరించారు. నియోజకవర్గ కేంద్రాలలో ఈఅర్‌ఒల పరిధిలో ఈవీఎం యంత్రాలు ఉంచాలని తగిన అధికారులను భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరా మొబైల్‌ ద్వారా వెళ్ళేటట్లు ఉంటే ఆ వాహనంకు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉదయం పంపడం తిరిగి సాయంత్రానికి వచ్చిన తర్వాత సరైన భద్రత కల్పించడం చేయాలన్నారు. ఈవిఎం యంత్రాలు అతి సున్నితమైనవని భద్రత చాలా ముఖ్యమని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తప్పవన్నారు. కార్యాలయంలో అవగాహన కోసం ఈవీఎం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, డిఆర్‌ఓ రాజశేఖర్‌, నోడల్‌ అధికారి చంద్రశేఖరనాయుడులు ప్రారంభించారు.

➡️