ప్రజాశక్తి-సోమల : సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి పశు వైద్యాధికారిణి మారసాని చందన ప్రియ జాతీయ పురస్కారం అందుకున్నారు. విజయవాడ గన్నవరం ఎన్టీఆర్ కళాశాలలో జాతీయ టెక్నికల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర పశుసంవర్ధన శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సత్యకుమారి చందన ప్రియకు అవార్డు అందజేశారు. రెండు రోజులుగా జరిగిన ఈటెక్నికల్ కాన్ఫరెన్స్లో దేశవ్యాప్తంగా 231 మంది పశు సంవర్ధక శాఖకు చెందిన వారు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ చందన ప్రియ గొర్రెలకు శస్త్ర చికిత్సలు చేయడంలో ప్రయోగాత్మకంగా సారాంశం వివరించడం లో ప్రతిభ చూపినందుకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందన ప్రియ ప్రజాశక్తితో మాట్లాడుతూ ఈ జాతీయ పురస్కారం తనకు రావడం మరింత బాధ్యతలను పెంచిందన్నారుదన్నారు.