ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఈనెల 27,28వ తేదీలలో జిల్లాలో సేంద్రీయ సాగు పరిశీలనకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బందం పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైౖతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తతంగా, సమర్థవంతంగా ప్రకతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంప్రదింపుల సమూహం) శాస్త్రవేత్తల బందం ఈ నెల 27,28 వ తేదీలలో జిల్లాలో పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతు సాధికార సంస్థ ‘ఆంధ్రప్రదేశ్ ప్రజాభాగస్వామ్య ప్రకతి వ్యవసాయం (ఏపీసీఎన్‌ఎఫ్) ప్రాజెక్టు పేరుతో అమలుచేస్తున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలు ప్రపంచం దష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో లావోస్ పీడీఆర్, భారత్, కెన్యా, జింబాబ్వే, సెనెగల్, బుర్కినా ఫావో, ట్యునీషియా, పెరూ మొత్తం 8 దేశాలకు చెందిన 60మందితో కూడిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర వాటాదారుల బందం ద్వైవార్షిక విరామం, ప్రతిబింబంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీఎన్‌ఎస్ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలను అర్ధం చేసుకోవడానికి సందర్శిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిరాడ్, వరల్డ్ ఫిష్,అలయన్స్, బయోడైవర్శిటీ, ఒఈపి, ఇనేరా సంస్థల ప్రతినిధులు ఈ బందంలో వున్నారు. రాష్ట్రంలో కరువు ప్రాంతంగా పేరుబడ్డ రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా ఈ బందం ఈ నెల 27వ తేదీన బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరే ఈ బందం రెండు గ్రూప్‌లుగా విడిపోయి నేరుగా గ్రామాలను చేరుకొంటుంది. రోజుకో గ్రామం చొప్పున రెండు గ్రూప్‌లు జిల్లాలోని 4 గ్రామాలను సందర్శిస్తాయి. జిల్లాలో పర్యటించే బందంలో విందారు దిమోనియో, మారియా క్లాడియా క్రిప్టాన్, షాలిని రామిరెజ్, మాన్యువల్ నర్జస్, మారియా కరోలినా, వాటిజ్ రోజాస్, అలెజాండ్రా, అలెజాండ్రా వరగాస్ మాడ్రిడ్, కెవిన్ ఒన్యాంగో, సుదర్శన్ మలైయప్పన్, గోపాల్ కుమార్, సిల్వియా వ్యానిరా, తొరై జిగ్వేనా, మార్సెలాబెల్ట్రాన్, సిమోన్ సైగర్ రివాస్, అర్వెన్సెలీ, రాక్సా సోక్, అరిలియా మాంజెల్లా ఎన్జీవా, ఆరిలియా మాంజిల్లా ఎన్జీ వానదియా బెర్గామిని గుల్షన్ బోరాలు ఉంటారు. ఒక బందం తొలిరోజు సోమవారం కుప్పం పరిధిలో గుడుపల్లి మండలంలోని గోకర్లపల్లి, సిగలపల్లి గ్రామాలలో మద్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పర్యటిస్తుంది. ఆయా గ్రామాలలో ఏపీసీఎన్‌ఎఫ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రకతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన అనంతరం బంద సభ్యులు మహిళా సంఘాలతో, రైతులతో విడివిడిగా సమావేశం అవుతారు. రెండవ రోజు మంగళవారం ఇదే బందం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రామకుప్పం మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి విత్తన గుళికలు తయారు చేసే విధానం మొదలుకొని, డ్రాట్ ప్రూప్ మోడల్, ఏటీఎం మోడల్స్ సందర్శన, విత్తనం నాటడం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రామైక్య సంఘం, యువరైతులు, రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, నిరుపేదలు తదితర గ్రూప్‌లతో విడివిడిగా మాట్లాడి ప్రకతి వ్యవసాయ విధానాల గురించి, తద్వారా కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలుసుకొంటారు. రెండవ బందం మొదటి రోజు బంగారుపాలెం మండలంలోని కల్లూరిపల్లి గ్రామంలో గ్రామ మంతా కలియతిరిగి ప్రకతి, రసాయన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రెండింటికీ మధ్య గల తేడాలను గ్రహిస్తారు. ఆ తర్వాత ఏపీసీఎన్‌ఎఫ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించిన ఏటీఎం, ఏ గ్రేడ్ వంటి ఆదర్శవంతమైన వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తారు. రెండవరోజు పెనుమూరు మండలంలోని చారవగానిపల్లి గ్రామంలో పర్యటిస్తారు. ముందుగా విత్తన గుళికల తయారీపై ఏపీసీఎన్‌ఎఫ్ అధికారులు ప్రదర్శించే డెమో కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కార్యక్రమంలో పా ల్గొంటారు. అనంతరం కరువు పరిస్థితులను అధిగమించే డ్రాట్‌ప్రూఫ్ మో డల్‌ను సందర్శించి అక్కడ చేపట్టిన విత్తనం నాటే కార్యక్రమంలో పాల్గొ ంటారు. ఆ తర్వాత ఏ గ్రేడ్, ఏటీఎంమోడల్‌లో రూపొందించిన ప్రకతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తారు. గ్రామసమైక్య సంఘం ప్రతిని థులతో సమావేశమైప్రకతి వ్యవసాయ వ్యవసాయ విస్తరణ జరిగిన తీరు, మహిళలపాత్ర గురించి తెలుసుకొంటారు. చివరగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, నిరుపేదలు, యువరైతులు, రైతు పారిశ్రామిక వేత్తల బందాలతో విడివిడిగా చర్చిస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.