భారత్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేలా గ్రామ పంచాయతీశాఖ, పంచాయతీరాజ్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండీ ప్రచార వాహనాల ద్వారా విసృత్త ప్రచారం నిర్వహింస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారిణి లక్ష్మి తెలిపారు. ఈనెల 25వ తేదీ శనివారం చిత్తూరు జిల్లాలో ప్రచార యాత్రను జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. 27వ తేదీ నుండీ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రజాశక్తి ప్రత్యేక ఇంటర్వూలో వీకిత్ భారత్ ప్రత్యేకతలను ఆమె తెలియజేశారు. ప్రజాశక్తి: వీకిత్ భారత్ జిల్లాలో ఎన్ని పంచాయతీల్లో, ఎన్ని వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు? డిపిఒ: జిల్లాలో ఈనెల 27వ తేది సోమవారం నుండీ వీకిత్ భారత్ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 694 గ్రామ పంచాయతీల్లో 6 వాహనాలతో 60రోజుల పాటు గ్రామ పంచాయతీల్లో కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించడం జరుగుతోంది. ప్రజాశక్తి : వీకిత్ భారత్ వల్ల ప్రయోజనం ఏమిటి? డిపిఒ: ప్రజల్లో కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను తెలియజేయడంతో పాటు సంక్షేమ పధకాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనే అంశాలను వివరించేందుకు ఈకార్యక్రమం ఉపయోగపడుతుంది. అర్హులైన లబ్దిదార్లును కూడా గుర్తించడం జరుగుతుంది. రోజుకు రెండు పంచాయితీల్లో ఒక వాహనం అంటే అరు వాహనాలు రోజుకు 12 నుండీ 15 పంచాయితీల్లో ప్రచారం నిర్వహిస్తాయి. ప్రజాశక్తి: ఈకార్యక్రమం విజయవంతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? డిపిఒ: జిల్లా స్థాయి నోడల్ అధికారిగా జెడ్పి సీఈఓ వ్యవహరిస్తారని, జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 6 నియోజకవర్గాలకు 6 వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కో వాహనం ప్రతి రోజు రెండు పంచాయతీల్లో డిజిటల్ స్క్రీన్ లో వీడియోల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరిగింది. వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసుకుని నిర్వహిస్తున్నాం. . ఎంపిడిఓలు మండలాలలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకొని విజయవంతం చేయాల్సి ఉంటుంది. ప్రజాశక్తి: ఏఏ పధకాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు? డిపిఒ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీన దయాళ్ అంత్యోదయ యోజన, పిఎం ఆవాస్ యోజన, పిఎం ఉజ్వల్ యోజన, పిఎం విశ్వకర్మ, పిఎం కిసాన్ సమ్మాన్, కిసాన్ క్రెడిట్‌కార్డ్, పిఎం పోషణ్ అభియాన్, జల్‌జీవన మిషన్, స్వామిత్వ, జనధన యోజన, జీవన జ్యోతి భీమా యోజన, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పిఎం ప్రణామ్, నానోఫెర్టి లైజర్ వంటి 17 సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పథకాల ద్వారా ఇంకనూ లబ్ధి పొందేందుకు అర్హులు ఉంటే వారిని గుర్తించి నమోదు చేసేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజాశక్తి: రైతులకు, యువకులకు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? డిపిఒ: ప్రకతి వ్యవసాయం పద్ధతులను ఆచరిస్తున్న రైతులతో ముఖాముఖి, సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణ, గ్రామస్థాయిలో ప్రతిభ కనపరచిన క్రీడాకారులను, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధితో అభివద్ధి చెందిన వారిని సన్మానించడం, విద్యార్థులచే క్విజ్‌పోటీల నిర్వహణ, హెల్త్‌క్యాంప్‌ల నిర్వహణ, టిబి స్కీనింగ్ తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రెటరీలు ప్రధానపాత్ర, ఇందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్‌లో భాగంగా ఫోటోలు, వీడియోలను సంబంధిత యాప్ నందు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.