ప్రమాదాన్ని గుర్తించిన గ్యాంగ్‌మెన్ మరమ్మతుల అనంతరం కొనసాగిన రాకపోకలుప్రజాశక్తి- ఐరాల : రామేశ్వరం నుంచి తిరుపతికి వెళుతున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరగకుండా రైల్వే ఉద్యోగి గ్యాంగ్‌మెన్ సుజిత్ రైలును ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. చిత్తూరు నుంచి సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తిరుపతికి వెళుతున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ పి.కొత్తకోట రైలుమార్గంలో వెళుత్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న గ్యాంగ్‌మెన్ సుజిత్ రైలు పట్టా ఒకటి విరిగి ఉండడాన్ని గమనించి వెంటనే రెడ్ సిగల్ ఇవ్వడంతో లోకో పైలెట్ (ట్రైన్‌డ్రైవర్) చాకచక్యంగా రైలును ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాంగ్‌మెన్ ప్రమాదాన్ని చూడకుండా ఉండి ఉటే పెద్దప్రమాదం జరిగి ఉండేది. వెంటనే పాకాల రైల్వేసిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి రైల్వేట్రాక్ మరమ్మతులు చేపట్టడంతో రామేశ్వరం రైలు ఆలస్యంగా వెళ్ళింది. ప్రమాద నుండి తప్పించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన గ్యాంగ్‌మెన్ సుజిత్‌ని రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసించారు. రైల్వే ట్రాక్ మరమ్మతు చేసిన తరువాత యథాప్రకారం రైలు రాకపోకలు సాగాయి.