ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

Nov 24,2023 23:56
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

ప్రజాశక్తి – వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): సరిగ్గా నెల్లూరులో జరిగిన ఘటన లాంటిదే… చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపలం సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగింది. తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై కారు డ్రైవర్‌ దాడిచేసిన ఘటనకు సంబంధించి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అల్లెయ్య చెప్పిన వివరాల మేరకు… తిరుపతి డిపోకు చెందిన డ్రైవర్‌ ఈశ్వరయ్య ఏపీ 03 జెడ్‌. 5302 నంబర్‌ గల బస్సు డ్రైవ్‌ చేస్తూ తిరుపతి నుంచి పళ్లిపట్టు(తమిళనాడు రాష్ట్రం)కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వెదురుకుప్ప మండలం పచ్చికాపల్లం సచివాలయం సమీపంలో పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఎపి 03 బిపి 1584 నంబర్‌ గల కారు రోడ్డుపై ఆపి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు. డ్రైవర్‌ హారన్‌ కొట్టి కారు పక్కన పెట్టమని చెప్పాడు. దీంతో కారు యజమాని అనుచరులతో కలిసి డ్యూటీలో ఉన్న డ్రైవర్నును కిందికి లాగి దుర్భాషలాడి పిడిగుద్దులు గుద్ది దాడి చేశారు.ఒకరిని గుర్తించాం : ఇన్‌ఛార్జి ఎస్‌ఐ దస్తగిరి దాడికి పాల్పడిన వారిని వీడియోలు ఆధారంగా గుర్తించాం. అతనిది మాంబేడు పంచాయతీ పరిధిలోని ధర్మాచారు గ్రామానికి చెందిన మోహన్‌. అనుచరులను గుర్తించే పనిలో ఉన్నాం.ఫిర్యాదు చేసాం : తిరుపతి డిపో సిబ్బందిఆర్టీసీ డ్రైవర్‌ ఈశ్వరయ్య పై దాడి చేసిన వారిని శిక్షించాలని తిరుపతి డిపో సిబ్బంది తిమ్మారెడ్డి వెదురు కుప్పం పోలీస్‌ స్టేషన్లో శుక్రవారం ఈశ్వరయ్యతో కలిసి ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి ఎస్‌ఐ దస్తగిరి సానుకూలంగా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరలా ఇలాంటి సంఘటన పునరావతం కాకుండా చూడాలని కోరారు.

➡️