ఘనంగా ఎన్‌సిసి ఆవిర్భావ వేడుకలు

విన్యాసాలు చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి -పాయకరావుపేట:శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్‌ డిగ్రీ కళాశాలలో ఎన్‌.సి.సి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్‌ కె.నూకరాజు ఎన్‌.సి.సి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్‌.సి.సి విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలన్నారు.నిరంతర సాధనే ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందన్నారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొనేందుకు ఎన్‌.సి.సి ఒక సరైన మార్గమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పిరమిడ్‌ ఆకృతిలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టు కొన్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్‌ జూనియర్‌ కళాశాల, స్పేసెస్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్‌.సి.సి. క్యాడెట్స్‌, ఏ.ఎన్‌.ఓ లు పాల్గొన్నారు.

➡️