ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ అధికారి రాహుల్‌ మాలిక్‌, కలెక్టర్‌ తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి

జిల్లాలో ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు వికాసిత్‌ భారత్‌ యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారి రాహుల్‌ మాలిక్‌ తెలిపారు. వికాసిత్‌ భారత సంకల్ప యాత్ర నిర్వహణ తీరుతెన్నులపై గురువారం జిల్లా కలెక్టర్‌ రవి పట్టం శెట్టితో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికై కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. విద్యా, వైద్యం, తాగునీరు, ఆర్థిక స్వావలంబన, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు, ఉపాధి, వ్యవసాయం, అనుబంధ శాఖల అభ్యున్నతి మొదలైన రంగాలలో పేదలకు అండగా అనేక పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొనసాగుతున్న పథకాలపై ప్రజలందరికీ క్షుణ్ణమైన అవగాహన తీసుకురావాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ రవి పట్టంశెట్టి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ కె.వి.మురళీకృష్ణ, డిఆర్‌ఓ బి.దయానిధి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.స్మరణ రాజ్‌, కెఆర్‌సిసి ఎస్‌డిసి ఏ.మహేష్‌, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి మంజుల వాణి, డిఎంహెచ్వో డాక్టర్‌ ఏ.హేమంత్‌, సిపిఓ జి.రామారావు, వ్యవసాయ శాఖ జెడి మోహన్‌రావు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️