డిసెంబర్ 4న ఛలో ఢిల్లీని జయప్రదం చేయండి

Dec 1,2023 11:23 #anakapalle district
dec 4th chalo delhi

ప్రజాశక్తి-దేవరాపల్లి : సామాజిక న్యాయం దళితహక్కుల రక్షణ కోరకు డిసెంబర్ 4న ఛలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, వ్వవసాయకార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు. అనంతరం ఆయిన మాట్లాడారు. 76 ఏళ్ళ స్వతంత్ర భారతం నేటికి దళిత, గిరిజనులపై దాడులు అత్యాచారాలు, మానభంగాలు సాగుతూనే ఉన్నాయని తెలిపారు. మణిపూర్ మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి హత్యాచారం చేయడం యావత్ భారతాన్నే తలదించుకునేల చేసిందని తెలిపారు ఇంత జరిగినా మతోన్మాద ప్రధాన మంత్రి మోడీ పల్లెత్తు మాట మాట్లాడక పోగా ద్రోహులకు రక్షణ కల్పించడం అత్యంత సిగ్గు చేటన్నారు. ఇటువంటి ఘటనలను మన రాష్ట్ర పాలక వర్గాలు ఖండించక పోవడం దుర్మార్గమైందని తెలిపారు. అనగారిన వర్గాలంటే ఆధిపత్య కులాలకు, పాలక పార్టీలకు ఓటు బ్యాంక్ తప్ప మనుషులుగా చూడడం లేదన్నారు. బిజెపి కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లను అమలు చేయకుండా చూస్తుందని తెలిపారు. లౌకిక రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. హక్కులను కాల రాస్తున్నదని. రాష్ట్రంలో కూడా రోజు రోజుకు దళితులపై దాడుల పెరుగుతున్నాయని తెలిపారు. దళితుల హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నాయని అన్నారు. దళితులు గిరిజనులు భూములకోసం వచ్చిన భూచట్టాలను,అసైన్డ్ చట్టాలను కాలరాసి భూస్వాముల పక్షాన ప్రభుత్వం నిలబడుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్ గ్ పోస్టులను భర్తీ చేయకుండా దళితులకు ద్రోహం చేస్తుందిని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41వ సిఆర్పిసి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని ఖండించాలి. ఎస్సీ,ఎస్టీలపై దాడులు,హత్యలు, స్త్రీలపై అత్యాచారాల కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫార్సుల అమలు చేయాలి.ఎస్సీ,ఎస్టీ విజిలెన్సు&మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి సంఘాలకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలి. కులవి వక్షత, అంటరానితనం పై ప్రభుత్వమే ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలి. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. డా॥బి.ఆర్. అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని కాపాడాలి. బిజెపి మతోన్మాద శక్తులు, మనువాద రాజ్యాంగం అమలుకు చేస్తున్న కుట్రలను త్రిప్పికొట్టాలి.అన్ని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం కొనసాగించాలి. దళితులకు స్మశాన స్థలాలు లేని గ్రామాలను గుర్తించి సిసిఎల్ఎ 2-10-2022న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కేటాయించాలి. స్మశానాలకై ఇచ్చిన జీవో 1235 అమలుకు కృషి చెయ్యాలి.

మౌళిక సదుపాయాలు కల్పించాలి.

దళితులను హత్య చేసిన, శాశ్వత వికలాంగులను చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలి. జాతీయ నూతన విద్యా విధానం అమలు వల్ల దళిత విద్యార్థులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం వచ్చింది. నిర్భంద ఉచిత విద్య హక్కు చట్టం ప్రకారం దళిత విద్యార్థులు చదువుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మూతపడ్డ పాఠశాలలను తెరిపించాలి. ఎస్పీ, ఎస్టీ ఉప ప్రణాళికా చట్టం ప్రకారం బడ్జెట్లో ప్రక్కదారీ పట్టించిన నిధులను తిరిగి కేటాయించాలి.
డప్పు కళాకారులు, చర్మకారులకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ను 5 వేలకు పెంచాలి. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలం, రెండు ఎకరాల సాగు భూమి కేటాయించాలి.పక్కా గృహనిర్మాణానికి రూ.5 లక్షలకు పెంచాలి.కోనేరు రంగారావు సిఫార్పులను అమలు చెయ్యాలి. భూస్వాముల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములు తీసుకొని పేదలకు పంచాలి. అసైన్డ్ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలి.

రాయసీమ జిల్లాల్లో స్మశానాల్లో పని చేస్తున్న కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించాలి. విదేశీ విద్యోన్నతి నిధులు పెంచి అర్హులందరికి శిక్షణ తరగతులు నిర్వహించాలి. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని,దళిత గిరిజనులకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 300 యూనిట్లకు పెంచాలి. కాటికాపరులు, స్కావెంజర్స్ సమస్యలు పరిష్కరించాలని డిశంబర్ 4 జరుగుతున్న ఛలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని వెంకన్న కోరారు

➡️