ప్రజాశక్తి – మాడుగుల: ఎన్నికల ముందే సీఎం జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. వైసీపీ నాలుగున్నర ఏళ్లుగా దౌర్జన్యం, దోపిడీ బ్లాక్ మెయిల్ వంటి బెదిరింపు రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసిందని ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అండతో వైసీపీ నాయకులు భూ దందాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు అద్దేపల్లి జగ్గారావు,తెలుగు యువత అధ్యక్షులు వడ్డి రాజ్ కుమార్,ఎంపిటిసి పైలా ముత్యాల నాయుడు, టీడీపి నాయకులు డి వి జగదీశ్వర రావు, యల్లంకి మోహన్, గట్రెడ్డి కొండలరావు, కుంచంగి శ్రీనివాస రావు, బాదం నాగరాజు, సింగం శెట్టి రాజు నాయుడు, వంతాల పోతురాజు, టి పైడి రాజు,తదితరులు పాల్గొన్నారు,