సింగవరం భూములపై జాయింట్‌ సర్వే

దీసరి గంగరాజు

ప్రజాశక్తి -అనంతగిరి:జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ భూ ములు సరే నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలకు భూములు కేటాయింపు చేయాలని కోరుతూ స్థానిక సిపిఎం జెడ్పీటీసీ దీసరి గంగరాజు నేతృత్వాన ఆ పార్టీ నేతల పిర్యాదు మేరకు మంగళవారం రెవెన్యూ ఫారెస్ట్‌ భూ సర్వే మండలంలోని నాన్‌ షెడ్యూల్‌ గరుగుబిల్లి పంచాయతీ సింగవరం రెవెన్యూ పరిధిలో పూతికవలస, సింగవరం గ్రామాల గిరిజనులు సాగులో ఉన్న భూములను రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారుల సరిహద్దు రికార్డుల వివాదంపై సర్వే చేపట్టారు. జిల్లా రెవెన్యూ సర్వేయర్‌ వి.మోహన్‌రావు, అనంతగిరి తహశీల్దార్‌ రాంబాయి, ఫారెస్ట్‌ రేంజర్‌ దుర్గాప్రసాద్‌లు అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు సమక్షాన జాయింట్‌ సర్వే నిర్వహించారు. రెవెన్యూ, ఫారెస్ట్‌ రికార్డులు పరిశీలించారు. కలెక్టర్‌కు నివేదిక అనంతరం వారం రోజుల్లో ప్రత్యేక సర్వే నిర్వహించి భూ సమస్యను పరిష్కారం చేస్తామని జిల్లా సర్వేయర్‌ తెలిపారని గంగరాజు అన్నారు. భూముల వ్యవహారంపై స్పష్టత ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు పరిష్కరించ కపోవడంతో రెవెన్యూ ఫారెస్ట్‌ భూములు సరిహద్దులు తెలియక సాగులో ఉన్న రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. కొంతమంది భూస్వాములు సరిహద్దు భూములను క్రయవిక్రియలు చేస్తూ ప్రభుత్వ భూములను అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న అమాయక గిరిజనులకు సెంటు భూమి దక్కని పరిస్థితిలో గిరిజనులు కొటు మిట్టాడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి తవ్విటినాయుడు, మాజీ సర్పంచ్‌ బి.సింహాచలం, మండల సర్వేయర్‌ తేజేశ్వరరావు వి.ఆర్‌.ఓ.కోటేశ్వరరావు, టిడిపి నాయకులు శివ స్వామి, గిరిజన సంఘం నాయకుడు ఎన్‌.సురేష్‌ ఫారెస్ట్‌ అధికారులు పాల్గొన్నారు

➡️