తాపీమేస్త్రీలకు నిధులు కేటాయించాలి

తాపీమేస్త్రీలకు నిధులు కేటాయించాలి

సమావేశంలో మాట్లాడుతున్న హైమావతి

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలోని సంత బయలు వద్ద తాపీమేస్త్రీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం గిరిజన మహిళ సంఘం జిల్లా నేత హైమావతి మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులైన తాపీ మెస్త్రీల సంక్షేమం కోసం ప్రభుత్వం లేబర్‌ బోర్డు ద్వారా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గతంలో లేబర్‌ బోర్డు ద్వారా తాపీమేస్త్రీలు, భవన నిర్మణ కార్మికుల సంక్షేమం కోసం నిధులు ఇచ్చే వారని, ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాదం జరిగితే 5 లక్షల ఇన్సూరెన్స్‌ ఇవ్వాన్నారు. మరణిస్తే 20 లక్షల ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ఇల్లు, పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేసి,కార్మికుల పిల్లల విద్య కోసం స్కాలర్‌ షిప్‌, పెళ్లి ఖర్చులు తదితర వాటిని మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు, తడిగిరి వైస్‌ సర్పంచ్‌ కిల్లో రామారావు, భవన నిర్మణ కార్మికులు ప్రెసిడెంట్‌ శిద్దేస్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మురళి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️