జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం
ప్రజాశక్తి-విఆర్ పురం : తుఫాను కారణంగా రైతులు తమ వరి పంటను జాగ్రత్త చేసుకుంటూ ఆకాశం ఒంక చూస్తున్నారు. ఇంతకాలం ఇంటిల్లిపాది కష్టపడి పండించిన వరి సాగు ఇప్పుడు వర్షం పడితే ఆర్దికంగా నష్టపోతామని పలువురు గిరిజన గిరిజనేతర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలములో సుమారు 4,వేల 191 హెక్ట్టర్స్ లో వరి సాగు అయింది. గత యేడాది కంటే ఈ సారి ఈ ఏడాది వరికి వాతావరణ పరిస్థితులు అనుకూలించి మంచి దిగుబడి వచ్చే వీలు ఉందని ఆయా గ్రామాల రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు తుపాన్ హెచ్చరికలతో రైతన్న దిగులు చెందుతున్నాడు. మండలంలో ఇప్పటికే కొన్ని చేలు కోతలు పూర్తి అయి చేలల్లో పనలు పెట్టీ ఉన్నారు కొన్ని చేలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుణుడు తుపాన్ రూపంలో వస్తె మాత్రం రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని పలువురు రైతులు వాపోతన్నారు. ఇప్పటకే అధిక పెట్టుబడి పెట్టీ పంట చేతికి వచ్చే సమయం ఇది తుపాన్ వలన బారీ. నష్టాలు తప్పవని దిగులు చెందుతున్నారు. ఏమి చేస్తుందో ఈ తుపాన్ అంటూ దిక్కు తొచనీ స్థితి లో రైతులు ఉన్నారు. కాలమే కరునుంచాలని కోరుతున్నారు.