క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్రా

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-పాడేరు:యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈనెల 15వ తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు దాదాపు 50 రోజుల పాటు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలు జరుగుతాయని చెప్పారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడలకుగాను ప్రతి సచివాలయం వారిగా ఆడదాం ఆంధ్రాకు రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఇప్పటి వరకు పాడేరులో 508 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆమె వెల్లడించారు. 15 సంవత్సరాలు దాటిన వారంతా ఆడుదాం ఆంధ్రా కు అర్హులేనని పేర్కొన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సంతోషాన్నిస్తాయని తెలిపారు. హుకుంపేటకు చెందిన రవళి అంథుల క్రికెట్‌ విభాగంలో జాతీయస్థాయిలో ప్రతిభ కన బరచడం గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో ట్రై కార్‌ చైర్మన్‌ శతక బుల్లిబాబు, ఎంపీపీ సొన్నారి రత్నకుమారి, వైస్‌ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూతంగి సూరిబాబు, జిల్లా వైఎస్‌ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్న దొర, మండల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు, పార్టీ మండల ఉపాధ్యక్షులు పసుపుల సత్యనారాయణ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వనుగు బసవన్న దొర, జిల్లా పంచాయతీరాజ్‌ కమిటీ అధ్యక్షులు గబ్బాడి చిట్టిబాబు పాల్గొన్నారు.

➡️