పార్టీ మామార్పుపై ప్రచారం అవాస్తవం

మాట్లాడుతున్న దొన్ను దొరపార్టీ

ప్రజాశక్తి -అరకులోయరూరల్‌: తన ఎదుగు దలను చూసి ఓర్వలేక కొందరు పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, టిడిపికి నమ్మక ద్రోహం చేjనని, ఆ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని దొన్నుదొర వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆదివారం ఆయన ఇంటి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ పార్టీ తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షులుగా నియమించిందని, ఈ గౌరవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని తెలిపారు.పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గిరిజనులకు అన్యాయం చేస్తూనే ఉందన్నారు. గిరిజనులకు అన్యాయం జరుగుతున్నా చట్టసభల్లో కనీసం నోరు మెదపలేని వైఎస్‌ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎందుకు అని ఆయన ఎద్దేవా చేశారు. గిరిజన ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలని, ఎప్పటినుంచో పోరాటం చేస్తున్న జీవో 3 విషయంలో వైఎస్‌ఆర్సిపి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారిమళ్లించి నవరత్నాల కోసం వినియోగిం చుకుంటూ గిరిజనులను మోసం చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని రద్దుచేసిన ఈ ప్రభుత్వం గిరిజన విద్యను కుంటుపడేలా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసు బాబు, మాదల సర్పంచ్‌ శ్రీనివాసరావు, బొర్రా సర్పంచ్‌ జన్ని అప్పారావు, ఉప సర్పంచ్‌ పాడి నిర్మల, ములియపుట్‌ సూపర్‌ ఉప సర్పంచ్‌ కిరసానీ మత్యరాజు, మాజీ ఎంపీటీసీలు లక్ష్మీ, కిల్లో కుమార్‌ బాబురావు, అరకు అసెంబ్లీ అధికార ప్రతినిధి కొర్ర నీరజా లక్ష్మీ, తులవతి ,వార్డు మెంబర్‌ గంగ, తెదేపా నాయకులు బొడ్డా శ్యామ్‌ సుందర్‌, పోతురాజు, చందు, రాము, మహదేవ్‌ పాల్గొన్నారు.

➡️