జీతంలో కోతలు.. కార్మికుల వెతలు అయోమయంలో సాంఘీక సంక్షేమ ఔట్ సోర్సింగ్ కార్మికులుచేయించుకొనేది బండెడు చాకిరీ.. పైగా చెల్లింపుల్లో కోత.. అధికారులను నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో సాంఘీక సంక్షేమశాఖలో ఔట్సొర్సింగ్ కార్మికుల వెతలు వర్ణనాతీతంగా ఉంది. -ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్ ఉమ్మడి జిల్లాలో 330మంది ఔట్ సొర్సింగ్ విధానంలో కామాటి, వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. 30రోజులకు ప్రభుత్వ నెలకు రూ.13085జీతాన్ని వీరికి చెల్లిస్తోంది. అయితే అక్టోబర్ నెలలో మూడు రోజుల వేతనాన్ని కోత విధించి 27 రోజులకు మాత్రమే వేతనాన్ని చెల్లించింది. కేవలం రూ.11వేల జీతం మాత్రమే బ్యాంకులో జమైంది. 30 రోజులకు హాజరైనట్లు సంతాకాలు చేయించుకొని సంక్షేమశాఖ డిడి కార్యాలయానికి పంపితే 27రోజులకు మాత్రమే వేతనం జమ కావడంతో కార్మికులు అయోమయంలో పడ్డారు. దాదాపు రూ.4లక్షలు హుష్కాకి.? కార్మికులకు అక్టోబర్ నెలలో విధించిన కోతతో 330మందికి గానూ రూ.4లక్షలు నష్టపోయారు. అయితే ఎందుకిలా జరిగింది ఎవరి అలసత్వంపై ఇలా చేశారనే విషయాన్ని అధికారులను నిలదీయడానికి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల వేతనం ఏమైనట్లు అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలో విలీనమైన కార్మికులకు పూర్తి వేతనం జమైనట్లు సమాచారం. చిత్తూరు జిల్లాకు సంబంధించిన కార్మికుల జీతాల్లోనే కోత విధించడంపై అసహనం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇకనైనా అధికారులు మూడు రోజుల వేతనంలో విధించిన కోతలకు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సి ఉందని కార్మికుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.