ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని ఆర్ల పంచాయతీకి చెందిన ఆదివాసీ గిరిజన గర్బిణీని డోలిపై ఆసుపత్రికి తరలించారు. కొండ శిఖర లోసింగి గ్రామానికి చెందిన మర్రి శాంతి(22) రెండో కాన్పు కావడంతో గురువారం ఉదయం పురిటి నొప్పులతో రావడంతో డోలి కట్టి లోసింగి నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో గల వైబి.పట్నం గ్రామానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి ఆటోలో రోలుగుంట పిహెచ్‌సికి తరలించారు. 2020 సంవత్సరంలో గ్రామస్థులందరూ కలిపి వైబి పట్నం నుండి లోసింగి గ్రామం వరకు నాలుగు కిలోమీటర్లు సొంతంగా డబ్బులు వేసుకొని కాలి బాట నిర్మాణం చేసుకున్నారు. గ్రామంలో కనీసం ఆరోగ్య కార్యకర్త కూడా లేరని, నిండు గర్భిణీ డోలు మూసుకుని కొండలు వాగులు దాటుకుంటూ. ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి ఉందని గ్రామస్తులు తెలిపారు.