జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కృషి : కలెక్టర్‌

Nov 29,2023 22:32

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)కృష్ణాజిల్లాను పారిశ్రామికంగా అభివద్ధి పరిచేందుకు అన్ని విధాల కషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు అన్నారు.కష్ణాజిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో రూ.8.17 కోట్ల వ్యయంతో (భారత ప్రభుత్వం 5.07 కోట్లు, ఏపీఐఐసీ 3.10 కోట్లు) మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో జ్యూయలరీ పార్క్‌ లో మౌలిక వసతులు ఆధునీకరణ పనులు ప్రారంభోత్సవం, గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో రూ..14.70 కోట్ల వ్యయంతో (భారత ప్రభుత్వం రూ.10.29 కోట్లు, ఏపీఐఐసీ 4.41 కోట్లు) ఇండిస్టియల్‌ పార్క్‌ ఫేజ్‌ 3 మౌలిక వసతుల అభివద్ధి పనుల శంకుస్థాపన రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్‌ గా నిర్వహించగా, ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎమ్మెస్‌ నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ జన్ను రాఘవరావు, డి ఆర్‌ ఓ పెద్ది రోజా, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సీతారాం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఆర్‌. వెంకట్రావు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ సిలార్‌ దాదా, జువెలరీ పార్క్‌ ప్రతినిధులు జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️