కార్మికులు, స్కీమ్‌ వర్కర్ల్ల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు

Nov 19,2023 01:01 #palnadu district

 

పల్నాడు జిల్లా: పెరిగిన నిత్యావసర ధరలకు అను గుణంగా పెరగని వేతనాలతో కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు, అంగ న్వాడీలు, స్కీం వర్కర్లు అర్ధాకలితో అల మటిస్తున్నారని సిఐటియు రాష్ట్ర ఉపా ధ్యక్షులు కె.ఎం శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం నరసరావు పేట ప్రాజెక్టు సమావేశం జరిగింది. సమావేశానికి ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు కెపి మెటిల్డా దేవి అధ్య క్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీని వాసరావుమాట్లాడుతూ పనిచేసే క్రమంలో కార్మికులు అని, వేతనాలు ఇవ్వాలంటే వాలంటీర్లు.. సేవాపరులు అని అం టున్నారని విమర్శించారు. ఆశా, అంగ న్వాడి, స్కీమ్‌ వర్కర్లకు పిఎఫ్‌, ఈఎస్‌ఐ, కనీస వేతనాలు సైతం అమలు చేయడం లేదని విమర్శించారు. బిజెపి అను సరి స్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానా లకు వ్యతిరేకంగా ఈ నెల 27,28 తేదీ లలో విజయవాడలో జరగనున్న నిరసన దీక్షలు జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అఖిల భారత కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో దేశంలో ఉన్న కార్మిక, వ్యవ సాయ, రైతు, కార్మిక సంఘాలు , సం యుక్త కిసాన్‌ మోర్చా 500 సంఘాలు పైబడి బిజెపి విధానాలను ప్రజలకు దేశా నికి కలిగిస్తున్న నష్టాలను వ్యతిరేకిస్తూ నిర సన చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వేత నాలు, ఇతర సమస్యల గురించి ప్రశ్నించ లేని పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. అంగన్వాడీలకు కనీస వేత నాలు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ గ్రాట్యూటి వర్తింప జేయాలని, ఉన్నత న్యాయస్థానాలు తీర్పు చెప్పినా ఫలితం శూన్యమని అన్నారు. కర్ణా టకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గ్రాట్యూటీ అమలు చేస్తు న్నారని, ఆశా, అంగన్వాడి స్కీమ్‌ వర్కర్లకు తక్షణమే కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కంటే వెయ్యి రూపా యలు అద నంగా ఇస్తామని చెప్పి కనీసం సమానంగా కూడా ఇవ్వడం లేదని విమ ర్శించారు. ఐక్య పోరాటాల ద్వారా హక్కులు సాధిం చుకోవాలనే ఉద్దేశంతోనే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాల్లో నిరసనలు జరుగు తాయన్నారు. వైజాగ్‌ విశాఖ ఉక్కు పరి శ్రమకు ప్రభుత్వం రూ 5 వేల కోట్లు పెటు ్టబడులు పెడితే ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లకుపైగా పన్నుల రూపంలో ప్రభు త్వానికి చెల్లించడం జరి గిందని, ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమ విలువ రూ.3 లక్షల కోట్లు కాగా అతి తక్కువ మొత్తానికి అదాని, అంబానీలకు కారుచౌకగా కట ్టబెట్టాలని చూస్తోందని విమర్శించారు. విద్యుత్‌,పోస్టల్‌, రైల్వే ఎల్‌ఐసి ఇలా అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసి రాష్ట్రానికి, ప్రజలకు తీరని ద్రోహం చేస్తోం దని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రభుత్వ యం త్రాంగం మొత్తం ప్రైవేటీకరణ జరిగితే రానున్న రోజుల్లో ప్రజలపై భారాలు మరింత పెరుగుతా యన్నారు.
యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ వివిధ స్కీములకు ఇచ్చే నిధులను తగ్గించారని, ప్రజలకు ఇచ్చే పౌష్టికాహారంలో కోతలు పెడుతున్నారని, తొమ్మిదిన్నరేళ్ల బిజెపి పాలనలో ఆశా, అంగన్వాడీలకు వేతనాలు పెంచిన దాఖలాలు లేవని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ కనీసం యూనియన్‌ నాయకులను చర్చలు కూడా పిలవలేదని అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ ఈ నెల 21, 22 తేదీల్లో అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నాలు చేయనున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వ స్పందించకపోతే వచ్చే నెల 8 నుండి సమ్మెకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులకు హెల్పర్లుగా, టీచర్లుగా పదోన్నతి కల్పించాలని, అంగన్వాడి సెంటర్లలో మౌలిక సదు పాయాలు కల్పిం చాలని, 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యూని యన్‌ జిల్లా అధ్యక్షురాలు కెపి మెటిల్డా దేవి మాట్లా డుతూ నవంబర్‌ లో అన్ని యాప్‌ లను కలిపి ఒకే యాప్‌ చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పిన డైరెక్టర్‌ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. మూడు నెలలుగా వేతనాలు లేక టిఎలు, సెంటర్‌ అద్దెలు, గ్యాస్‌ సొంత నిధులతో సెంటర్లు నడుపు తున్నట్లు చెప్పారు. చివరకు రిజిస్టర్లు కూడా అంగ న్వాడీల సొంత నిధులతో కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నిర్మల, కవిత, మాధవి, సాయి, నాగమణి, వెంకటరమణ, ధనలక్ష్మి పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️