ప్రజాశక్తి- అరకులోయ :ఈనెల 12న అరకు నియోజకవర్గం పరిధిలోని హుక్కుంపేట మండలం కేంద్రంలో జరిగే సామాజిక సాధికార బస్ యాత్రను విజయవంతం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్రంగా కృషి చేసిందన్నారు. ఈ బస్సు యాత్రలో వైసిపి ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, కన్వీనర్లు, ఈ యాత్రకు తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాల్గుణ కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శెట్టి అప్పాలు, రామ్మూర్తి, సాంబయ్య, శ్రీను, రామన్న, గోపాల్, శెట్టి వెంకటరావు, పి.సంపత్, దురియ, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.