నిరసన తెలియజేస్తున్న న్యాయవాదులు
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టన ఏపి భూ హక్కుల చట్టం(యాక్టు 27/2023)ను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ బుధవారం నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యలు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ చట్టం ప్రకారం సిరాస్తి హక్కుల కోసం రెవెన్యూ ట్రిభ్యునలును ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి టైటిల్లింగ్ అధికారి నమోదు చేసిన భూ హక్కులు పై జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేయాల్సి ఉంటుందన్నారు. రెండు సంవత్సరాలలోపు ఈ వివాదాలపై అభ్యతరం తెలపాలన్నారు. నిరక్షరాస్యులు ఎక్కవగా ఉంటే గ్రామీణ ప్రజలు నష్టపోతారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ చట్టం అమలులో లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి లోకా లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.