ఇంటర్నెట్‌డెస్క్ : చలికాలంలో ఒళ్లునొప్పులు బాధిస్తాయి. నొప్పులు తగ్గడానికి చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కాలంలో నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే వాటి నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా..!- కొద్దిగా అల్లం పేస్టుని ఓ గుడ్డలో కట్టి దాన్ని కొంచెంసేపు వేడినీటిలో మరిగించాలి. అది చల్లారిన తర్వాత నొప్పి ఉన్న భాగంలో ఈ అల్లం రసంతో మర్దనా చేసుకుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. – వేడి పాలలో పసుపు, దాల్చిన చెక్క వేసుకుని తాగినా.. నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో కాళ్లు, చేతులు, మెడ వంటి ఏ భాగాల్లో అయినా ఎక్కడైనా నొప్పిగా ఉంటే.. ఆ భాగంలో పసుపు పేస్టును రాయడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. – కొద్దిగా ఆవనూనెను తీసుకుని వేడిచేసి నొప్పి ఎక్కువగా ఉన్న భాగంలో మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. –