శీతాకాలంలో జలుబు, దగ్గుల నుండి ఉపశమనం పొందాలంటే..?!

Nov 28,2023 13:18 #Health Awareness, #winter

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో జలుబు, దగ్గులు వేధిస్తాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటి బారినపడి ఎంతో ఇబ్బంది పడతారు. మంచువల్ల గురయ్యే సీజనల్‌ వ్యాధులకు ఎన్ని మందులు వేసుకున్నా త్వరగా తగ్గవు. అయితే మందుల నుంచి ఉపశమనం పొందలేకపోతే.. రోజూ కొన్ని పానీయాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. – ఈ కాలంలో రోజూ అల్లం టీ తాగితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే తులసి ఆకులతో తయారుచేసే టీ తాగినా జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఈ టీ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. – వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే మంచిది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. – ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను తేనె కలుపుకుని తాగితే మంచిది. తేనెలో జలుబును తగ్గించే లక్షణాలు మెండుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. – వేడి నీళ్లలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే గొంతునొప్పి, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వేడి నీటిలో అరటీస్పూన్‌ పసుపును కలిపి మరిగించి, వడకట్టుకుని ఆ నీటిని తాగితే దగ్గు సమస్య తగ్గుతుంది.

➡️