ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించడం చట్ట విరుద్దమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీనిపై వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దొడ్డిదారిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం చట్ట విరుద్దమని అన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
