ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో 2వ రోజు ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలి. వివాదాస్పదమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రైతుల పంటకు స్వామినాథన్ కమిషన్ సూచించిన ప్రకారం సి2 ప్లస్ 50శాతం ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలి, ధరల పెరుగుదలను అరికట్టాలి, లఖింపూర్ ఖేరి రైతుల హత్యకు ప్రధాన కారకుడైన కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలి వంటి డిమాండ్లతో దేశ వ్యాప్తంగా ఈ ధర్నా జరుగుతుంది.