కళ్లాల్లో ధాన్యం కొనుగోలు చేయాలి : ఎపి రైతు సంఘం

Nov 25,2023 21:50 #ap raithu sangam, #Dharna

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ఏలూరు రూరల్‌ మండలంలోని మల్కాపురంలో ఎపి రైతు సంఘం నాయకులు శనివారం పర్యటించి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం ఇప్పటి వరకు కళ్లాలోనే ఉందని, అకాల వర్షాలు పడితే తీవ్ర ఇబ్బందులు పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా చూడాలని నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రైతుల కళ్లాల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వాతావరణంలో మార్పులు రావడంతో వర్షాలు కురుస్తున్నాయని, అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చిరిగిన గోనె సంచులు ఇవ్వడం వల్ల ధాన్యం నేలపాలై రైతులు నష్టపోతున్నారన్నారు. తేమ శాతం నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని, నాణ్యమైన గోనె సంచులు రైతులకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లుకలాపు దుర్గారావు, లుకలాపు రమేష్‌, వట్టి సత్యనారాయణ, ఎ.రామారావు, కె.ప్రసాద్‌, మజ్జి రామారావు పాల్గొన్నారు.

➡️