సమస్యలపై జిజిహెచ్‌ మెస్‌ వర్కర్ల ధర్నా

Dec 2,2023 08:40 #Dharna, #ggh

ప్రజాశక్తి-కాకినాడ :తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఆఫీసు వద్ద జిజిహెచ్‌ మెస్‌ వర్కర్లు శుక్రవారం ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, మెస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వై శంకర్‌, ఎ ఏడుకొండలు మాట్లాడారు. రెండు నెలల నుంచి వర్కర్లకు కాంట్రాక్టర్‌ వేతనం ఇవ్వడంలేదన్నారు. పండుగ సమయాల్లోనూ కార్మికులకు ఇవ్వకుండా వేతనాలు పని చేయించుకుంటున్నారని చెప్పారు. పిఎఫ్‌ సొమ్ము అకౌంట్‌కు జమ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. రెండు నెలల క్రితం వేతన ఒప్పందం కోసం కాంట్రాక్టర్‌కు చార్ట్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ లెటర్‌ ఇచ్చినా చర్చలు జరపట్లేదని తెలిపారు. దీనిపై జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌కు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. ధర్నా అనంతరం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ నిమ్మగడ్డ బుల్లిరాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటరమణ, వై శ్రీనివాస్‌, ఎస్‌కె శ్రీనివాస్‌, టి వీరబాబు, ఎ వీరభద్రరావు, కె సురేష్‌, దుర్గ, లక్ష్మి, గణేష్‌, నాని, విజరు, వెంకటేష్‌, రమేష్‌, నాగేశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు.

➡️