పేదల హృదయాల్లో ‘ముప్పరాజు’ స్థానం పదిలం

Nov 27,2023 00:20 #సిపిఎం

ప్రజాశక్తి-కొండపి : కష్టజీవుల విముక్తి కోసం పరితపించిన ముప్పరాజు శేషయ్య మరణించి 23 ఏళ్లు గడిచినా.. పేదల హృదయాల్లో ఆయన స్థానం పదిలంగా ఉందని సిపిఎం మండల కార్యదర్శి కెజి. మస్తాన్‌ తెలిపారు. పెరిదేపిలోని ఎంఎస్‌ విజ్ఞాన కేంద్రంలో ముప్పరాజు శేషయ్య వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా శేషయ్య చిత్రపటానికి అంగలకుర్తి జాంబులు , బ్రహ్మయ్య అధ్యక్షతన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మస్తాన్‌ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శేషయ్య విద్యార్థిగా ఉన్నప్పుడే బాల సంఘాన్ని స్థాపించి శాస్త్రీయ దృక్పథం కలిగించే కృషి చేశారన్నారు. ధనిక రైతు కుటుంబంలో జన్మించినా సమాజంలో అట్టడుగునున్న కష్టజీవుల హక్కుల కోసం అంకితభావంతో పనిచేశారని తెలిపారు. భూమి పంచాలని, కనీస వేతనాలు ఇవ్వాలని దళితులకు, బలహీన వర్గాలకు నివాస స్థలాలు కావాలని శేషయ్య ఆధ్వర్యంలో 46 యేళ్ల క్రితం పోరాటాలు నిర్వహించిట్లు తెలిపారు. ఆ పోరాటాల గురించి ప్రజలు నేటికి నిత్యం చెప్పుకుంటూ ఉంటారన్నారు. పెరిదేపి గ్రామం నుంచి పూర్తి కాలం కార్యకర్తలుగా తీర్చిదిద్ది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కార్యకర్తల తయారు చేసిన ఘనత శేషయ్యకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పరాజు శేషయ్య సతీమణి లక్ష్మమ్మ, పార్టీ నాయకులు ఆదిలక్ష్మి, సిపిఎం మండల కమిటీ సభ్యులు కాలే మల్లికార్జున, అంగలకుర్తి చిన్నబ్రహ్మయ్య, కౌలురైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల చిన్నపేతురు, మల్లె కొండయ్య, గడ్డం వందనం, మల్లెల పేతురు, మాజీ ఎంపిటిసి పోగు ప్రసాదు, మల్లెల నిర్మల, లక్కీపోగు దేవారం, గంటనపల్లి కృష్ణమూర్తి , సామేలు పాల్గొన్నారు.

➡️