అంబేద్కర్ ఆశయాలతో యువత ముందుకు సాగాలి

Nov 26,2023 14:13 #East Godavari

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పు-గోదావరి) : డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్ల సామాజిక అసమానతలను తొలగించుకుని, భారత ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారన్నారు ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి. ఆదివారం 74వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని, మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. అనంతరం భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాలంగి అంబేద్కర్ కాలనీ, అంబేద్కర్ విగ్రహం వద్ద, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉండ్రాజవరం ఎస్సై కె రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని చూపించిన రూపకర్త, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలతో యువత ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీవీఎస్ ఆర్కే రాజు, గ్రామ సర్పంచ్ బొక్కా శ్రీనివాస్, వెలిచేటి బోసు, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, బ్రాహ్మణ సూరిబాబు, ఈడుపుగంటి ఉదయభాను, బొక్కా శివ, తొర్లపాటి సత్తిబాబు, కాటూరి కుమార స్వామి, మేళం రవి, కాటూరి రవి ప్రసాద్, పాలంగి భరత్, మేళం సందీప్, అంబేద్కర్ యువజన సంఘస్తులు జిల్లెల్ల వెంకటేష్, మేళం విజయ ప్రభాకర్, మండల పరిషత్, గ్రామ సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️