గండికోటలో భారీగా మొహరించిన పోలీసులు
ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన గండికోటలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారం చేత తొలగించడం జరుగుతుంది. శనివారం ఉదయం నుంచే గండికోట ముఖద్వారం వద్ద నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు. అందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని రెవిన్యూ సిబ్బంది చెబుతున్నారు. అక్రమ కట్టడాలను జేసిబిల ద్వారా తొలగిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామంలోని ప్రజలు ఒక గండికోటకే పరిమితమా లేక గండికోటలో భూములను కూడా ఆక్రమించిన వారికి కూడా తొలగించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. గూడెం చెరువు రాజీవ్ నగర్ కాలనీలో పెద్ద ఎత్తున భూములను ఆక్రమించి కట్టడాలు నిర్మించాలని వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.